విస్తారమైన అంతరిక్షం, అనేక గ్రహాలూ వాటిలో జీవులు మనుగడ సాగించగల పరిస్థితులను గురించి మనం తరచుగా వింటూ ఉంటాము. ఆదికాండము భూమిపై సృష్టింపబడిన జీవులను గురించి మాత్రమే మాట్లాడుతూ వుంది. అట్లే ఇతర గ్రహాలలో జీవమును గురించి ప్రస్తావించటం లేదు. బైబులు ఈ విషయాన్ని ప్రస్తావించక పోవడం బట్టి మరెక్కడా జీవం లేదని అనుకోవచ్చా లేదా భూ గ్రహానికి ఆవల జీవులు సాధ్యమని అనుకోవచ్చా?
బైబిల్ మాట్లాడే ఏకైక భూలోకేతర జీవితం దేవదూతలది. ఈ భూమిపై ఉన్న ప్రజలతో దేవుని పరస్పర చర్య గురించి-ముఖ్యంగా అతని రక్షణ కార్యకలాపాల గురించి మాత్రమే బైబులు మాట్లాడుతూ వుంది (యోహాను 3:16). అదేవిధంగా, యేసు “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” (మార్కు 16:15) అనే మాటలు ఈ లోకములో వున్నవారందరికి సువార్తను తీసుకెళ్లవలసిన అవసరం గురించి మాత్రమే మాట్లాడాడు.
ఆదికాండము 1 మరియు 2లోని దేవుని సృష్టి రికార్డు విశాలమైన విశ్వాన్ని వివరిస్తుంది, భూమిపై ఉన్న ప్రజలు ఆయన సృష్టికి కిరీటంయై యున్నారు. ఇతర గ్రహాలలో జీవులు ఉండుటకు సంభావ్యత వున్నదని బైబిల్ చెప్పటం లేదు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.