పది ఆజ్ఞలు

కుటుంబ యజమాని తన కుటుంబము లోని వారికి నేర్పవలసిన సులభ క్రమము.

మొదటి ఆజ్జ్య
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

దీనికి అర్ధమేమి?

మనము సమస్తమైన వాటికంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మియుండవలెను.

రెండవ ఆజ్జ్య
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, ఆయన పేరిట శపింపకయు, ఒట్టుపెట్టుకొనకయు, అబద్ధమాడకయు, వంచన చేయకయు, మంత్రతంత్రములు చేయకయు, సకల శ్రమలయందు ఆయనను పేరు పెట్టి పిలిచి వేడుకొని, స్తుతించి మరియు కృతజ్ఞత అగపరచవలెను.

మూడవ ఆజ్జ్య
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్జ్యపాకముంచుకొనుము.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి సువార్త ప్రసంగమునుగాని మరియు ఆయన వాక్యమును గాని అలక్ష్యము చేయక, పరిశుద్ధముగా నెంచి సంతోషముతో విని నేర్చుకొనవలెను. 

నాల్గవ ఆజ్జ్య
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన తల్లితండ్రులను మరియు అధికారులను అగౌరవింపకయు లేక వారికి కోపము పుట్టింపకయు, వారిని సన్మానించి, సేవించి, వారికి లోబడి, వారికి ప్రేమను మరియు మర్యాదను ఇవ్వవలెను.

ఐదవ ఆజ్జ్య
నరహత్య చెయ్యకూడదు.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన పొరుగు వాని శరీరమునకు హానినైనను లేక ఆపదనైనను కలుగజేయక, ప్రతి శారీరక అవసరతయందు వానికి సహాయముగాను మరియు స్నేహితునిగాను ఉండవలెను. 

ఆరవ ఆజ్జ్య
వ్యభిచరింపకూడదు.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మాటలయందును మరియు క్రియలయందును, శుద్ధమైన మరియు మర్యాదకరమైన జీవితమును జీవించవలెను మరియు భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించి సన్మానింపవలెను.

ఏడవ ఆజ్జ్య
దొంగిలకూడదు.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన పొరుగువాని డబ్బునైనను లేక ఆస్తినైనను తీసుకొనకయు లేక మోసకరమైన విధములచేత వాటిని పొందక, వాని ఆస్తిని మరియు జీవనోపాధిని అభివృద్ధిపరచి కాపాడుటలో వానికి సహాయము చేయవలెను.

ఎనిమిదవ ఆజ్జ్య
నీ పొరుగువానిమీద అబద్దసాక్ష్యము పలుకకూడదు

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన పొరుగువానిగూర్చి అబద్ధములు చెప్పకయు, వానికి ద్రోహము చెయ్యకయు లేక వానికి అపకీర్తి సంభవింప చేయకయు, అతని పక్షముగా మాటలాడి, అతనిని గూర్చి మంచి మాటలు పలికి, అతని మాటలు మరియు క్రియలను గూర్చి ప్రేమగల భావము కలిగియుండవలెను.

తొమ్మిదవ ఆజ్జ్య
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన పొరుగువాని స్వాస్థ్యమును లేక యింటిని తంత్రోపాయముచేత సంపాదించక లేక అన్యాయమును న్యాయమనిపించి దానిని పొందక, అవి అతనివద్ద ఉండుటకు మనము చేయగలిగిన సహాయము చేయవలెను.

పదవ ఆజ్జ్య
నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు

దీనికి అర్ధమేమి?

మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన పొరుగువాని భార్యను, పనివారిని, పశువులను, బలవంతముగా లేక ఆశ చూపి వారి నుండి దూరపర్చక, వారును, అవియు అతని యొద్దనుండి చేయవలసినదంతయు చేయునట్లు మనము వారిని ప్రేరేపించవలెను.

సారంశాము
ఈ ఆజ్జ్యలన్నింటిని గూర్చి దేవుడు తెలియజెప్పినదేమి?

“నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్జ్యలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించువాడనై యున్నాను” అని ఆయన చెప్పెను.

దీనికి అర్ధమేమి?

దేవుడు ఈ ఆజ్జ్యలను మీరు వారినందరిని శిక్షించెదనని బెదిరించుచున్నాడు. గనుక మనము ఆయన కోపమునకు భయపడి, ఈ ఆజ్జ్యలకు విరోధముగా ప్రవర్తింపక యుండవలెను.

అయినను ఈ ఆజ్జ్యలను గైకొను వారికందరకును కృపను సకలాశీర్వాదములను దయచేసెదనని ఆయన వాగ్దానము చేయుచున్నాడు. గనుక మనము ఆయనను ప్రేమించి ఆయన యందు నమ్మకముంచి ఆయన ఆజ్జ్యలకు సంతోషముతో లోబడి ఉండవలెను.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.