పరలోకంలో ఇతరులను మనం గుర్తించడం గురించి బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. మోషే మరియు ఏలీయాలు ఎవరో పేతురుకు తెలుసు, అతను ఇంతకు ముందెన్నడూ వారిని వ్యక్తిగతంగా కలవలేదు (మత్తయి 17:4; మార్కు 9:5; లూకా 9:33). పరలోకంలో ఉన్న మన బంధువులును, స్నేహితులను, ఇతర క్రైస్తవులను గుర్తిస్తామని మరియు మన భూసంబంధమైన జీవితాల్లో మనం వారితో ఎలా ప్రవర్తించి ఉంటామో మనకు కూడా తెలుసని చెప్తూ ఉంటారు. లూకా 16:19-31లో ధనవంతుడు లాజరు అబ్రాహాము యొక్క సంభాషణ ఈ విషయా న్ని తెలియజేస్తూ వుంది. మరికొందరు 1 థెస్సలొనీకయులు 4:13-18ని సూచిస్తారు, సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించు చున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతోకూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుమాటనుబట్టి మీతో చెప్పున దేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచి యుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము. ఇక్కడ పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవులను ఓదార్చుతూ, వారు గతంలో మరణించిన క్రైస్తవులను చూస్తారని మరియు వారితో కలకాలం కలిసి ఉంటారని హామీ ఇస్తూ వున్నాడు.
మన నిత్యజీవితానికి సంబంధించిన ఏవైనా నిర్దిష్ట ప్రశ్నలకు బైబిల్ ఇప్పుడు సమాధానం ఇవ్వదు: “ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని యెరుగుదుము ”(1 యోహాను 3:2).
మరణ సమయంలో, శరీరం మరియు ఆత్మ వేరుగా ఉంటాయి (ప్రసంగి 12:7 మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును). చివరి రోజున, ప్రభువు మరణించిన వారందరి శరీరాలను లేపుతాడు. శరీరాలను మరియు ఆత్మలను తిరిగి కలుపుతాడు (యోహాను 5:28-29 దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానము నకును బయటికి వచ్చెదరు). క్రైస్తవుల విషయానికొస్తే, దేవుడు వారి శరీరాలను మహిమపరుస్తాడు మరియు మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును (పాపాన్ని బట్టి మనలోవున్న లోపాలను తొలగిస్తాడు) ఫిలిప్పీయులు 3:21. మనం ఖచ్చితంగా ఒకరికొకరు గుర్తించుకొంటాము.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.