అడ్వెంట్1 మార్కు 13:33-37
అంశము : ప్రభువు రాకడ కొరకు నిరంతరం కనిపెట్టుడి
- తన సంఘము కొరకు ఆయన నిన్ను భాద్యునిగా చేసాడు 33-34
- నీ పనిని గురించి ఆయన నిన్నే లెక్క అప్పగించువానిగా చేస్తాడు 35-37
అడ్వెంట్ 2 మార్కు 1:1-8
అంశము : ప్రభువు రాకడకై సిద్దపడండి
- సిద్దపడుటకైన అవసరత 1-3
- సిద్దపడు మార్గము 4-6
- ఎవరి నిమిత్తము సిద్ధపడాలి 7-8
అడ్వెంట్ 3 యోహాను 1:6-8; 19-28
అంశము : సాక్ష్యులు ఎవరన్నా ఉన్నారా?
- సాక్ష్యమిచ్చుటకు అవసరమైన అర్హతలు 6-8
- సాక్ష్యులు అవసరత 19-24
- సాక్ష్యము యొక్క సందేశము 25-28
అడ్వెంట్ 4 లూకా 1:26-38
అంశము : ఇది ఎలా జరుగుతుంది
- దేవుని దయ చాలా గొప్పది 26-28
- కన్యక ఒకనికి జన్మనిచ్చుట 29-31; 34-37
- దేవుని కుమారుడు మనుష్యుడగుట 31-33
క్రిస్మస్ లూకా 2:10-11
అంశము : క్రిస్మస్ జరుపుకోవడానికి మనకు ఏమి అవసరం
- దేవుని కుమారుని ఎదుట సాగిలపడదాం 11
- మన రక్షకుని ఎదుట మోకరిధ్ధాం 10, 11
- మన రక్షణను గురించి ఆనందిద్దామ్ 11
క్రిస్మస్ తరువాత 1st ఆదివారము లూకా 2:25-33
అంశము : ఇప్పుడు నేను సమాధానంలో వున్నాను ఎందుకంటే
- దేవుని ఆత్మ నాకు సూచనలు ఇచ్చుటను బట్టి
- దేవుని కుమారుడు నన్ను ఓదార్చుటను బట్టి
- దేవుని రక్షణ నాకు హామీ ఇచ్చుటను బట్టి
క్రిస్మస్ తరువాత 2nd ఆదివారము యోహాను 7:40-44
అంశము : యేసు విభేధములు పుట్టించాడు
- ఆయన ఎవరు అనే అంశముపై జనులు విడిపోయారు 40-42
- ఆయన కు జవాబు ఇచ్ఛే విషయములో జనులు విడిపోయారు 43-44
ఎపిఫని తరువాత 1st ఆదివారము మార్కు 1:4-11
అంశము : యేసుని ఇతరులు యెరుగునట్లు చేధ్ధాం
- ఆయన మనకు ఎంత అవసరమో ఇతరులకు చెప్పటం ద్వారా 4-6
- ఆయన ఎంత గొప్పవాడో ఇతరులకు చెప్పటం ద్వారా 9-11
ఎపిఫని తరువాత 2nd ఆదివారము యోహాను 1:43-51
అంశము : వచ్చి దేవుని కుమారుని చూడుడి; ఆయన క్రియలను చూడుడి
- తృణీకరింపబడియున్న వారికీ చేయూతను ఇచ్చుటకు ఆయన వచ్చి యున్నాడు 43,44
- ఆయన లేఖనములను సంపూర్ణము చేసియున్నాడు 45
- ఆయన మన హృదయములను ఎరిగియున్నాడు 46-48
- ఆయన మనలను పరలోకమునకు నడిపించును 49-51
ఎపిఫని తరువాత 3rd ఆదివారము మార్కు 1:16-20
అంశము : యేసు నా వెంబడి రండి అని పిలుచుచున్నాడు
- యోగ్యత లేని మనపై చూపిన దేవుని ప్రేమను బట్టి యేసుని వెంబడిధ్ధాం 16,17,19
- ఆయన పిలుపును బట్టి ఆయనను వెంబడిధ్ధాం 16-20
- సామర్ధ్యమును కలుగచేతునను ఆయన వాగ్దానమును బట్టి 17
ఎపిఫని తరువాత 4th ఆదివారము మార్కు 1:21-28
అంశము : యేసు యొక్క అధికారము
- ఆ మాటలలోని నిశ్చయతను చూడండి 21,22
- ఆయన శక్తిని చూడండి 23-28
ఎపిఫని తరువాత 5th ఆదివారము మార్కు 1:29-39
అంశము : యేసు మన నిజ స్నేహితుడై యున్నాడు
- రోగముతో పోరాడునప్పుడు 29-31
- సాతానుతో పోరాడునప్పుడు 32-34
- రక్షణ కొరకు పోరాడునప్పుడు 35-39
ఎపిఫని తరువాత 6th ఆదివారము మార్కు 1:40-45
అంశము : యేసు కనికరముగల మన రక్షకుడు
- నీ అవసరాలతో ఆయన యొద్దకు చేరుము 40
- విశ్వాస హృదయముతో ఆయన యొద్దకు రమ్ము 41
- ఆయన స్వస్థత స్పర్శను విశ్వసించు 41-42
- ఆయనకు స్తుతి చెల్లించుము 43-45
ఎపిఫని తరువాత 7th ఆదివారము మార్కు 1:1-12
అంశము : యేసు క్రీస్తే సర్వశక్తిమంతుడు
- యేసుకు తన శక్తిని గూర్చిన గొప్ప అవసరత తెలియును 1-4
- యేసుకు తన శక్తిని గూర్చిన మొదటి ప్రాముఖ్యత తెలియును 5
- యేసుకు తన శక్తిని గూర్చిన సరిఅయిన ఉపయోగము తెలియును 6-12
రూపాంతరపు ఆదివారము మార్కు 9:2-9
అంశము : రక్షకుని మహిమను చూధ్ధాం
- ఆయన వ్యక్తిత్వములోను 2,3
- ఆయన ఉదేశ్యములోను 4-6
- ఆయన ప్రజలలోను 7-9
లెంట్ 1st ఆదివారము మార్కు 1:12-15
అంశము : యేసు జీవిత ఉదేశ్యము
- సాతానుతో యుద్ధము చేయుట 12,13
- రక్షణను గెల్చుట 13
- దేవుని రాజ్యమును విస్తరింపచేయుట 14,15
లెంట్ 2nd ఆదివారము మార్కు 8:31-38
అంశము : యేసు యొక్క అద్భుతఃకరమైన సిలువ
- సిలువ చాలామందికి ఆటంకము కలిగిస్తుంది 31,32
- మనందరికీ సిలువ చాలా అవసరమైంది 33
- విశ్వాసులు సిలువకు స్పందిస్తారు 34-38
లెంట్ 3rd ఆదివారము యోహాను 2:13-22
అంశము : దేవునిని సరిఅయిన రీతిలో ఎలా ఆరాధించాలి
- వ్యక్తిగత ఆరాధనలో దేవుని ఎదుట వినయముగా ఉండుట ద్వారా 13-16
- దేవుని వాక్యము ద్వారా పరిశుదాత్మని మాటను జాగ్రత్తగా వినుట ద్వారా 17
- రక్షణ కొరకు యేసుని యందు పూర్ణ విశ్వాసము ఉంచుట ద్వారా 18-22
లెంట్ 4th ఆదివారము యోహాను 3:14-21
అంశము : మన యెడల దేవుని ప్రేమను ఏ విధముగా కొలవాలి
- ఆయన పరిపూర్ణమైన త్యాగాన్ని మనకు ఇచ్చును (లోతు) 14-17
- ఆయన ప్రజలందరినీ ప్రేమించును (వెడల్పు) 17-18
- ఆయన అంతులేని దీవెన లిచ్చును (ఎత్తు) 17-16
లెంట్ 5th ఆదివారము యోహాను 12:20-33
అంశము : యేసు ఎప్పుడు మహిమపర్చ బడతాడు
ఆయన చనిపోయినప్పుడు 23,24; 32,33
ఆయన తన శత్రువులను ఓడించినప్పుడు 31
ఆయన స్నేహితులు ఆయనను గౌరవించినప్పుడు 25,26
జనులు ఆయన యందు విశ్వాస ముంచినప్పుడు 20-23; 27-30;32
మట్టల ఆదివారము మార్కు 11:1-10
అంశము : యేసుకు హోసన్నా చెప్పండి
- ఎందుకంటే ఆయన అందరి కంటే గొప్పవాడు 1-6
- ఎందుకంటె ఆయన అందరి కంటే కృపగల వాడు 7-10
ఈస్టర్ ఆదివారము మత్తయి 28:1-10
అంశము : యేసుకు హోసన్నా చెప్పండి
- ఎందుకంటే ఆయన అందరి కంటే గొప్పవాడు 1-6
- ఎందుకంటె ఆయన అందరి కంటే కృపగల వాడు 7-10
ఈస్టర్ 2 ఆదివారము యోహాను 20:19-31
అంశము : ఈ క్రింది విషయాల ద్వారా ఈస్టర్ ఆనందాన్ని ఎల్లప్పుడూ ఉండేలా చెయ్యొచ్చు
- యేసు మనకు తెచ్చిన శాంతిలో ఆనందించుట 19-20
- యేసు మన కొరకు ఇఛ్చిన వాక్యము వైపు మరలుట 24-31
- యేసు మనకు ఇఛ్చిన అధికారమును ఉపయోగించుట 21-23
ఈస్టర్ 3 ఆదివారము అపొ. కార్య 4:8-12
అంశము : యేసు నామము యొక్క శక్తి
- ఇది స్వస్థపరచును 8-10
- ఇది ధైర్యవంతులుగా చేయును 10-11
- ఇది రక్షించును 12
ఈస్టర్ 4 ఆదివారము యోహాను 10:11-15
అంశము : యేసు మంచి గొర్రెల కాపరి
- గొర్రెల కొరకు తన్ను తాను అర్పించుకొన్నాడు 11-13, 17-18
- గొర్రెల యొక్క అవసరతలను తీర్చును 14-15
- ఆయన గొర్రెల సంఖ్యను పెంచును 16
ఈస్టర్ 5 ఆదివారము యోహాను 15:1-8
అంశము : మీ జీవితాలు ఎంత ఫలవంతముగా ఉన్నాయి
- పండ్లు కాయవలసిన అవసరము 1-3,6
- అన్ని పండ్లకు మూలాధారం 4-5
- పండ్లు కాయుటలోని దీవెనలు 7-8
ఈస్టర్ 6 ఆదివారము యోహాను 15:9-15
అంశము : యేసు ప్రేమిస్తున్నాడు గనుక మనమును ప్రేమిద్దాం
- మనము యేసు ప్రేమను పొందాము 9A
- యేసు ప్రేమకు స్పందించాము 9-10
- యేసు ప్రేమ యందు ఆనందించాము 11
- యేసు ప్రేమను చూపిధ్ధాం 12,13
- యేసు ప్రేమ ద్వారా స్నేహమును ఆనందిధ్ధాం 14,15
ఈస్టర్ 7 ఆదివారము యోహాను 17:9-11,20,21
అంశము : తండ్రి వారి ఏకముగా ఉందురు గాక
- పరిపూర్ణమైన ఏకత్వము కొరకైనా ప్రార్ధన 9,10,19,21
- పరిపూర్ణమైన ఏకత్వము కొరకైనా శక్తి 11,20
పెంతెకొస్తు దినము యోహాను 14:25-27
అంశము :పరిశుదాత్మను పొందినట్లు మనమెలా తెలుసుకోగలం
- రక్షణ జలమును గురించి మనము దప్పిగొనినప్పుడు
- జీవజాలములతో మనము పొర్లిపారినప్పుడు
త్రిత్వ ఆదివారము యోహాను 3:1-17
అంశము : మనము దేవునిని యెట్లు తెలుసుకొంటాము
- ఆత్మమూలముగా బాప్తిస్మము వలన తిరిగి జన్మించుట ద్వారా 1-8
- కుమారుని యందు విశ్వాసముంచుట ద్వారా 9-13
- తండ్రి ప్రేమ మీద ఆధారపడటం ద్వారా 14-17
పెంతెకొస్తు 2 మార్కు 9:23-28
అంశము : యేసుని సరిగా ఆరాధించాలి
- కృప యొక్క స్వతంత్రములో 23-25
- నీ జీవిత కేంద్రముగా 26-28
పెంతెకొస్తు 3 మార్కు 3:20-35
అంశము : మన రక్షకునికి వ్యతిరేకముగా దాడులు
- వారి నైజ గుణములు 20-27
- వారి ప్రభావములు 28-35
పెంతెకొస్తు 4 మార్కు 4:26-34
అంశము : దేవుని రాజ్యం ఇంకా పని చేస్తువుందా, అవును
- అది రహస్యముగా పెరుగుతూ వుంది 26-28
- గమ్యాన్ని స్పష్టపరుస్తూ వుంది 29
- చిన్నధిగానే ప్రారంభంఔతుంది 30-32
పెంతెకొస్తు 5 మార్కు 4:35-41
అంశము : ఎంత కష్టమైనప్పటికీ నమ్ముము
- మన విశ్వాసాన్ని బలపరచె సమస్యలు 35-37
- మన మనస్సును బాధపెట్టే ప్రశ్నలు 38
- మన హృదయాన్ని నెమ్మది పరచే ప్రభువు 39-41
పెంతెకొస్తు 6 మార్కు 5:21-24,35-43
అంశము : నమ్మిక మాత్రముంచుము
- నీ సమస్యలను ఎదుర్కొనేటప్పుడు యేసుని కనికరము వైపునకు తిరుగుము 21-24
- నీవు సందేహములను ఎదుర్కొనేటప్పుడు యేసు మాటలను ఆలకించుము 35-39
- నీవు మరణమును ఎదుర్కొనేటప్పుడు యేసు శక్తి యందు నమ్మిక ఉంచుము 40-43
పెంతెకొస్తు 7 మార్కు 6:1-6
అంశము : యేసు కొందరిని నేరస్థులన్నాడు
- ఆయన తన భోధలతో వారిని నేరస్థులన్నాడు 1,2
- ఆయన తన దర్శనము ద్వారా వారిని అభ్యంతరపడేటట్లు చేసాడు 2,3
- తృణీకరించుటను గురించి ఆయన వారిని ఎదిరించాడు 4
- వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని ఆయన నిందించాడు 5,6
పెంతెకొస్తు 8 మార్కు 6:30-34
అంశము : కొంత విశ్రాంతి తీసుకొనుడి
- అలసిన దేహముల కొరకు మంచి సలహా 30,31
- పాప రోగగ్రస్థమైన ఆత్మల కొరకు అవసరమైన సలహా 32-34
పెంతెకొస్తు 9 మత్తయి 22:15-22
అంశము : క్రైస్తవుడు దేశ భక్తిని ఎలా చూపిస్తాడు
- దేవుని కృపను ఒప్పుకొనుట ద్వారా 34 B
- దేవుని సాక్షిగా జీవించుట ద్వారా 34 A
పెంతెకొస్తు 10 యోహాను 6:1-15
అంశము : మన ప్రభువుకు దానిని విడిచిపెట్టుము
- ఆయనకు మన ప్రతి బలహీనతలు తెలియును 1-4
- ఆయన మన ప్రతి అవసరతలో జాగ్రత్త తీసుకొనును 5
- ఆయన మనలను ప్రతి పరీక్షా ద్వారా బలపరచును 5B-9
- ఆయన మనకు ప్రతి ఆశీర్వాదమును ఇచ్చును 10-15
పెంతెకొస్తు 11 యోహాను 6:24-35
అంశము : ప్రభువునుండి నీకు ఏమి కావాలి
- మనము తరచుగా క్షయమైన ఆహారంపై ద్రుష్టి ఉంచుదుము 24-27
- మన కందరికి సంతుష్టి కలిగించు ఆహారము అవసరము 28-35
పెంతెకొస్తు 12 యోహాను 6:41-51
అంశము : నీవి ఏమి తినుచున్నావో గమనించుము
- పరలోకము కొరకు కనిపెట్టుము 41-46
- నిత్యమైన లాభముల కొరకు కనిపెట్టుము 47-51
పెంతెకొస్తు 13 యోహాను 6:51-58
అంశము : నిత్యము జీవించుటకు తినుడి
- జీవము నీచు ఆహారమును కనుగొనుము 51-54
- క్రమముగా నిన్ను నీవు పోషించుకొనుము 55-58
పెంతెకొస్తు 14 యోహాను 6:60-69
అంశము : యేసు నీకు అభ్యంతరకరముగా ఉన్నాడా
- ఆయన కఠినమైన మాటలు మాట్లాడుటను బట్టి 60,62
- ఆయన కఠినమైన నిర్ణయము అడుగుచున్నాడు 62-66
- ఆయన నిత్యజీవమును సమర్పించుచున్నాడు 67-69
పెంతెకొస్తు 15 మార్కు 7:1-8,14-23
అంశము : ఎంత పరిశుబ్రముగా నీవు వున్నావు
- మానవుడు బాహ్యమైన వాటిని చూస్తాడు 1-5
- దేవుడు హృదయాన్ని చూస్తాడు 6-8
పెంతెకొస్తు 16 మార్కు 7:31-37
అంశము : ఎప్ఫతా లేక తెరవబడుము అని యేసు చెప్తున్నాడు
- చెవిటి చెవులకు ఆయన ఇలా చెప్తూవున్నాడు 31-34
- అద్భుతమైన శక్తితో ఆయన చెప్తూవున్నాడు 33-35
- పెదవులను సడలించుటకు ఆయన ఇలా చెప్తూవున్నాడు 36-37
పెంతెకొస్తు 17 మార్కు 8:27-35
అంశము : యేసు నందు నమ్మిక ఉంచుము
- నీ మహిమ గల దేవునిగా ఆయనను ఒప్పుకొనుము 27,30
- నీ కొరకు శ్రమపడిన రక్షకునిగా ఆయనను స్వీకరించుము 31-33
- నీ ప్రేమగల ప్రభువుగా ఆయనను వెంబడించుము 34,35
పెంతెకొస్తు 18 మార్కు 9:30-37
అంశము : ఒక వ్యక్తిని గొప్ప వానిగా చేయునది ఏమిటి
- గర్వమునకు గొప్పతనములో భాగము లేదు 33,34
- ప్రేమ జవాబులో ఒక భాగమై యున్నది 30-32
- పరిచర్య గొప్పతనములో మరొక భాగమై యున్నది 35-37
పెంతెకొస్తు 19 మార్కు 9:38-50
అంశము : నిజమైన శత్రువులెవరో గుర్తుపట్టండి
- యేసు నామములో సమర్పించదగిన పనులన్నిటినీ అంగీకరించుము 38-41
- విశ్వాసముతో బలహీనులను ఆటంకపరచు దేనినైనా నిరోదించుము 42
- నీలో నున్న ప్రతి పాపా కారణమును తొలగించుకొనుము 43-48
పెంతెకొస్తు 20 మార్కు 10:2-16
అంశము : వివాహము ఎంత కాలము ఉండవలెను
- మనిషి యిచ్చు సాకులు 2-5
- దేవుడు సూచించిన ఐక్యత 6-9
- యేసు భోదించుచున్న సమర్పణ 10-12
అంత్యకాలము 1 ఆదివారము మార్కు 13:5-11
అంశము : అంత్యదినానికి మనమెట్లు సిద్దపడదాం
- లోకము సూచనలను చూచుటకు మొగ్గుచూపును 3-8
- ప్రభువు శక్తి కొరకు చూచుట అవసరమైయున్నది 9-13
అంత్యకాలము 2 ఆదివారము యోహాను 5:19-24
అంశము : యేసుతో అంత్య తీర్పు కొరకు సిద్దపడుట
- ఆయనకు ఇష్టమైన వారికీ ప్రభువు బహుమానము ను ఇచ్చును 19-21
- ఎవరైతే నిజముగా నమ్మెదరో వారిని మాత్రమే ప్రభువు జీవించుటకు లేపును 22-24
అంత్యకాలము 3 ఆదివారము యోహాను 5:25-29
అంశము : నిత్యము జీవించుటకు మనకు ఏమి అవసరము
- యేసు ప్రేమను బట్టి నూతన జీవితాలను జీవించుట 25-26
- యేసు ప్రేమను ప్రతిబింబించే జీవితాలను జీవించుట 27-29
అంత్యకాలము 4 ఆదివారము మార్కు 13:32-37
అంశము : మనము క్రీస్తు కొరకు జీవిచు ప్రజలవలె ఎలా ఎదురు చూడాలి
- మన ప్రభువు తిరిగి వచ్చు వరకు పనిలో ఏకాగ్రత కలిగి యుండుము 34,35
- మన ప్రభువు తిరిగి వచ్చునప్పటికీ సిద్ధముగా ఉండుము 32,33,35a-37
కృతజ్ఞత ఆదివారము లూకా 17:11-19
అంశము : యెహోవాకు నేను ప్రతిగా ఏమి చెల్లించుదును
- దేవుని బహుమానములను గుర్తించుదును 12
- దేవుని కృపను జరుపుకొందును 13
- దేవుని మార్గమును వెంబడించుదును 14
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.