ఒక సంవత్సరంలో సీసన్స్ (కాలాలు) ఉంటాయి. అవి వాటి ప్రాముఖ్యతను ప్రాముఖ్యమైన అంశాలను పండుగలను సంస్కృతిని ఆచారాలను కట్టుబాట్లను వారి ప్రత్యేకతను చరిత్రను తెలియజేస్తాయి. అట్లే చర్చికి కూడా క్యాలెండరు వుంది. నాల్గవ శతాబ్దంలో క్రైస్తవ మతంలో లిటర్జికల్ క్యాలెండర్‌లు అభివృద్ధి చెందడం ప్రారంభించింది. అయితే చర్చి క్యాలెండర్ బైబిల్‌లో ఉందా? అని ఎవరన్నా ప్రశ్నించవచ్చు. ప్రత్యేకంగా అయితే లేదు, కానీ యూదుల ఉపవాస దినాలు మరియు పండుగల యొక్క చరిత్ర పాత నిబంధన అంతటా కనిపిస్తుంది. యూదులు తమ జీవితాలను ఏడాది పొడవునా పండుగల చుట్టూ నిర్మించుకొనేవాళ్ళు. యేసు కూడా యూదుల పండుగలను (పాస్ ఓవర్) ఆచరించినట్లుగా బైబిలులో వుంది. కాబట్టి క్రిస్టియన్ చర్చి క్యాలెండర్ బైబిల్‌లో లేనప్పటికి, దాని ఫ్రేమ్ ఫ్రేమ్‌వర్క్ మాత్రం ఖచ్చితంగా బైబులునుండే తీసుకోబడింది అని చెప్పొచ్చు.
హీబ్రూ క్యాలెండరులోని 12 నెలలు_
తిశ్రీ, చెష్వాన్, కిస్లేవ్, టెవెట్, షెవత్, అదార్, నిసాన్, అయ్యర్, శివన్, తమ్ముజ్, అవ్ మరియు ఎలుల్.
Tishri, Cheshvan, Kislev, Tevet, Shevat, Adar, Nisan, Iyar, Sivan, Tammuz, Av, and Elul.
హిబ్రూ క్యాలెండర్ వారం రోజులు_
సూర్యాస్తమయం నుండి రోజు ప్రారంభమవుతుంది మరియు సూర్యాస్తమయం వరకు రోజు కొనసాగుతుంది
యోమ్ రిషోన్ (yom rishon) మొదటి రోజు శనివారం ఆదివారము
యోమ్ షేని (yom sheni) రెండవ రోజు ఆదివారము సోమవారం
యోమ్ శెలిషి (yom shelishi) మూడవ రోజు సోమవారం మంగళవారం
యోమ్ రేవి (yom revi’i) నాల్గవ రోజు మంగళవారం బుధవారం
యోమ్ హమిషి (yom hamishi) ఐదవరోజు బుధవారం గురువారం
యోమ్ శిశి (yom shishi) ఆరవరోజు గురువారం శుక్రవారం
షబ్బత్ (Shabbat) ఏడవరోజు శుక్రవారం శనివారం
చర్చి క్యాలెండర్ సంఘసంవత్సరములోని ఏడు విభిన్న సీజన్లను గురించి మాట్లాడుతుంది: అడ్వెంట్ సీజన్, క్రిస్మస్ సీజన్, ఎపిఫనీ సీజన్, లెంట్ సీజన్, ఈస్టర్ సీజన్, పెంతెకొస్తు లేదా త్రిత్వ కాలము, అంత్యకాలము. బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అనేది ఒక ప్రసిద్ధ పురాతన ప్రార్థన పుస్తకం, దీనిలో అనుదిన ప్రార్థనలు బైబులు లోని పాఠాలు (అలాగే ఆదివారం ఆరాధన కోసం నిర్దేశిత స్క్రిప్చర్ పాఠాలు) చర్చి క్యాలెండర్ ఆధారంగా కలిగి ఉంది. ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘము దీనినే సంఘాలలో వాడేడిది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.