
పాత నిబంధన పాఠము: యిర్మీయా 31:31-34; పత్రిక పాఠము: హెబ్రీయులకు 5:7-0; సువార్త 9ఠము: యోహాను 12:20-33; కీర్తన 143.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యిర్మీయా 31:31-34
యిర్మీయా 31:31–34_ ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టు కొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవావాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును–యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.
మన పాఠములో దేవుడు నేను నా వీలునామాను మార్చి క్రొత్తనిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఆయన ప్రజలకు మధ్యన క్రొత్త నిబంధనకు కారణమేమై ఉంటుంది? క్రొత్తగా వీలునామా వ్రాయవలసి అవసరం దేవునికేమొచ్చింది. ఈ క్రొత్త వీలునామా ఎలా ఉండబోతూ ఉంది? అది మన మీద ఎలాంటి ప్రభావము చూపబోతు ఉంది? అనే ప్రశ్నలు మనకు రావొచ్చు. అలాగే ఆ ఒడంబడికలో “ప్రాముఖ్యమైనది ఏమై ఉంటుంది” అనే ఆసక్తి మనలో కలగొచ్చు. యెహోవా ఇశ్రాయేలును, యూదాను రెండింటినీ శిక్షించాడు. పాతనిబంధన అంతటిలో ఇక్కడ మాత్రమే క్రొత్తనిబంధన అనే మాట వాడబడి యున్నది.
దేవుని యొక్క వీలునామా ఎలా ఉండబోతుంది? అది మన మీద మన స్వాస్థ్యము మీద ఎలాంటి ప్రభావము చూపబోతూ ఉంది అనే ప్రశ్నలకు జవాబులను తెలుసుకొనేందుకు మన పాఠమును చదువుకొందాం.
దేవుని యొక్క క్రొత్త వీలునామా గురించి చింతించవల్సిన అవసరం లేదు
1. అది దేవుని చేత నిర్ధేశింపబడియున్నది
2. అది అందరి నిమిత్తమై యున్నది
3. అది కృప ద్వారా స్థాపించబడియున్నది
4. దాని ఫలితములు నూతనముగా చెయ్యబడియున్నవి
మన పాఠములో ఈ విషయాన్ని దేవుడు యిర్మీయా అను ప్రవక్త ద్వారా దేవుని ప్రజలు బబులోను చెరకు కొనిపోబడక ముందు బయలుపర్చాడు. ఆ కాలములో దేవునికి వ్యతిరేకముగా బహిరంగంగా తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు మీద దేవుడు తన తీర్పును ప్రకటిస్తూ, ప్రజలు చెరగా పరాయి దేశమునకు కొనిపోబడుదురని ప్రకటింప చేసాడు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.