లూకా 23:43లో యేసు ఇలా చెప్పాడు, “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు.” అయితే మన విశ్వాస ప్రమాణములో, “ఆయన నరకంలోకి దిగెను” అని చెప్తాము. వివరించండి.
బైబిల్ నిజమని మనకు నిశ్చయముగా తెలుసు. కాని యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు? ఈ రెండు స్టేట్మెంట్స్ విభిన్నముగా వున్నాయి వివరించండి.
సిలువపై, యేసు పశ్చాత్తాపపడిన దొంగతో: నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను, లూకా 23:43. మరణ సమయంలో, శరీరం మరియు ఆత్మ విడిపోతాయి. యేసు గుడ్ ఫ్రైడే నాడు మరణించినప్పుడు, పశ్చాత్తాపపడిన దొంగ యొక్క శరీరం మరియు ఆత్మ వలె ఆయన శరీరం మరియు ఆత్మ విడిపోయాయి. వారి శరీరాలు భూమిపైనే ఉన్నాయి, వారి ఆత్మలు పరదైసులోకి ప్రవేశించాయి. యేసు తన మరణానికి ముందు, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను, లూకా 23:46, అని పలికిన మాటలను గుర్తుచేసుకోండి.
పశ్చాత్తాపపడిన దొంగ శరీరం భూమ్మీద వుంది. అతని ఆత్మ పరలోకంలో వుంది. యేసు శరీరం మరియు ఆత్మ “మూడవ రోజున” తిరిగి కలిశాయి. అపొస్తలుల కార్యములు 2:31క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను. అనేక సార్లు యేసు చెప్పారు, ఉదాహరణకు, మత్తయి 16:21లో, అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా; మత్తయి 17:23 వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.
యేసు ఈస్టర్ ఆదివారం ఉదయం భూమిపై ప్రజలకు కనిపించడానికి ముందు, పాపంపై, సాతానుపై మరియు మరణంపై తన విజయాన్ని ప్రకటించడానికి తన శరీరం మరియు ఆత్మతో నరకంలోకి దిగాడు. 1 పేతురు 3:18-20 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను. 19-20దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.