ఒక వ్యక్తి చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు అదృశ్య రూపములోవున్న ఆ ఆత్మ ఇతరులను ఎలా గుర్తిస్తుంది లేదా భగవంతుడిని ఎలా కలుసుకుంటుంది? తీర్పు రోజు వరకు పరలోకములో వుండే సమయంలో ఆ ఆత్మ ఏమి చేస్తుంది? ఒకడు చనిపోయిన తరువాత వాని ఆత్మ వెంటనే పరలోకానికి వెళుతుందని బైబిల్ పేర్కొంది, కాని అదృశ్య రూపములో ఉన్న ఆ ఆత్మ ప్రభువుతో ఎలా సంతోషిస్తుంది? ఏమి జరుగుతూ ఉందొ ఆత్మకు తెలుస్తుందని, అతను/ఆమె అక్కడ ఎందుకు ఉన్నారని మరియు ఇతరులను గుర్తించగలరని సూచించే ఏదైనా బైబులు ఆధారం ఉందా? ఆత్మ అదృశ్య జీవి అయితే అది ఎలా గుర్తించగలదు?
మరణం తర్వాత మరియు తీర్పు దినానికి ముందు ఆత్మల స్థితి గురించి బైబిల్ తక్కువ సమాచారాన్ని అందిస్తూ వుంది. మరణం తరువాత, శరీరం మరియు ఆత్మ వేరుపడతాయి, (ప్రసంగి 12:7 మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును) తర్వాత తీర్పు జరుగుతుంది. (హెబ్రీయులు 9:27మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును). క్రైస్తవ విశ్వాసం ఒకనిలో ఉండుటను బట్టి లేదా లేకపోవడం ఆధారంగా ఆత్మలు పరలోకము లేదా నరకంలో ఉంటాయి (మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును). ఆత్మకు భౌతికశరీరం లేకపోవడాన్ని ఊహించుకోవడం కష్టముగా ఉన్నప్పటికి, ప్రకటన 6:9-10 _ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు–నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చక యు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు–వారివలెనే చంపబడబోవువారి సహదాసుల యొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను, అను మాటలు విశ్వాసుల ఆత్మలు దేవునికి మధ్యన జరిగే సంభాషణను గురించి ఇతర విషయాలను గురించి చెప్తూ వున్నాయి.
లూకా 16:19-31_ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధ పడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి –తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము – కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడు–తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహాము–వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు–తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు–మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు వినని యెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను; ఆత్మలకు వాటిచుట్టూ ఏమి జరుగుతూ ఉందొ తాను వాటిని ఎలా అనుభవిస్తూవుందో అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనే విషయమే కాకుండా ఇంకా చాల విషయాలు ఇక్కడ చెప్పబడి వున్నాయి. విశ్వాసులు పరలోకము యొక్క పరిపూర్ణ శాంతిని అనుభవిస్తున్నారు (ప్రకటన 14:13 అంతట–ఇప్పటినుండి ప్రభువు నందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు), అవిశ్వాసులు నరకం యొక్క బాధలను అనుభవిస్తున్నారు (లూకా 16:23 అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి). ఇంతకుమించి చెప్పడం మన పరిధికి మించినది బహుశా అది మీ అవగాహన కావొచ్చు.
క్రైస్తవులుగా మనం చేయగలిగేది ప్రభువుతో ఎప్పటికీ ఉండేందుకు ఎదురుచూడడమే (1 థెస్సలొనీకయులు 4:17ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభు వుతోకూడ ఉందుము).
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.