బైబిలులోని రెండు ప్రాముఖ్యమైన బోధలు ఏవి ?
* యోహాను 1:17, ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
*రోమా 1:16, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
జవాబు: బైబులులోని రెండు ప్రాముఖ్యమైన బోధలు ధర్మశాస్త్రము మరియు సువార్త.
ధర్మశాస్త్రము ద్వారా దేవుడు మనకేమి భోదించుచున్నాడు?
*మత్తయి 19:17-19, …. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు –ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.
*యాకోబు 2:8, మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించు వారగుదురు.
*రోమా 7:7, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
జవాబు: ధర్మశాస్త్రము ద్వారా ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదని దేవుడు కొంటున్నాడో వాటిని ఆయన మనకు భోదించుచున్నాడు.
దేవుని ధర్మశాస్త్రనుసారముగా మనము మన జీవితములను పరీక్షించుకొనినప్పుడు, ఆ ధర్మశాస్త్రము మనకు ఏయే విషయములను భోదించుచున్నది?
*గలతీయులకు 3:10, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
*రోమా 3:23, ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
*రోమా 3:20, ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
*రోమా 6:23, ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము.
*మత్తయి 25:41-46 ( తమ పాపములను బట్టి శపింపబడిన వారు నరకములో నిత్యము శిక్షింపబడుదురని యేసు చెప్పెను.)
జవాబు: దేవుని ధర్మశాస్త్రానుసారముగా మనము మన జీవితములను పరీక్షించుకొనినప్పుడు, మనమందరము దేవుని శిక్షయైన మరణమునకును మరియు శిక్షావిధికి పాత్రులమైయున్న పాపలమని అది మనకు భోదించుచున్నది.
సువార్త ద్వారా దేవుడు మనకేమి భోదిస్తూ ఉన్నాడు?
*కొలొస్సయులకు 2:13-15, మరియు అపరాధముల వలనను, …. మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధముల నన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను.
*లూకా 2:10,11 అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
*యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
జవాబు: సువార్త ద్వారా ప్రజలందరి యొక్క పాపములను తీసివేయుటకు ఆయన తన ప్రేమలో యేసును పంపెనని సువర్తమానమును దేవుడు మనకు భోదించుచున్నాడు.
*యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
*రోమా 1:16, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, ….. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
జవాబు: సువార్త ద్వారా యేసునందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవమును రక్షణను కలిగియుండునని దేవుడు మనకు భోదించుచున్నాడు.
అలాగైతే, బైబులు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యమేంటి?
*2 తిమోతికి 3:14, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు.
*యోహాను 20:31, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
*యోహాను 5:39, లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
*ఎఫెసీయులకు 2:20, క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
*రోమా 15:4, ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
జవాబు: బైబులు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యము తమ రక్షణ యొక్క ఏకైక నిరీక్షణగా యేసుసను తెలుసుకొనుటకు మరియు విశ్వసించుటకు ప్రజలందరినీ నడుపుటయై యున్నది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.