బాప్తిస్మము ద్వారా పరిశుధ్ధాత్మ పాపులకు సువార్తను వర్తింపజేస్తుందని, వారికి కొత్త జీవితాన్ని ఇస్తుందని మరియు అన్ని పాపాల నుండి వారిని శుభ్రపరుస్తుందని నేను నమ్ముతున్నాను (అపొస్తలుల కార్యములు 2:38, పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. తీతు 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను). నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, మార్కు 16:16 అని వాగ్దానం చేసినప్పుడు ప్రభువు బాప్తిస్మము యొక్క ఆశీర్వాదాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. బాప్తిస్మము యొక్క ఆశీర్వాదం శిశువులతో సహా ప్రజలందరికీ ఉద్దేశించబడిందని నేను నమ్ముతున్నాను, (మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి). శిశువులు పాపాత్మకంగా పుడతారు (యోహాను 3:6, శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది) కాబట్టి మళ్లీ జన్మించాలి, అంటే బాప్టిజం ద్వారా విశ్వాసానికి తీసుకురాబడాలి, (యోహాను 3:5, యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను).
ప్రభువు తన వాక్యాన్ని మరియు బాప్తిస్మము, ప్రభువు రాత్రి భోజనము అనే సంస్కారములను ఒక ప్రయోజనం కోసం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆయన తన అనుచరులకు, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి అని ఆజ్ఞాపించాడు (మత్తయి 28:19,20). దేవుని వాక్యం మరియు సంస్కారములు ద్వారా ఆయన ప్రపంచమంతటా పవిత్ర క్రైస్తవ సంఘాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు మరియు విస్తరిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులు తమ కొరకు మరియు ఇతరులకు సువార్తను తీసుకొని వెళ్లేందుకు దైవికంగా ఏర్పాటు చేయబడిన ఈ కృపా వాహనాలను ఉపయోగించడంలో శ్రద్ధగాను మరియు నమ్మకంగాను ఉండాలి. అమర్త్యమైన ఆత్మలు విశ్వాసానికి తేబడేందుకు మరియు పరలోకంలో జీవించడానికి ఇవి మాత్రమే మార్గం.
శిశువులు బాప్తిస్మము పొందకూడదని మరియు వారు క్రీస్తును విశ్వసించలేరనే అభిప్రాయాన్ని నేను తిరస్కరిస్తూ ఉన్నాను (లూకా 18:15-17, తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి–చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను). బాప్తిస్మము తప్పనిసరిగా ఇమ్మర్షన్ ద్వారా జరగాలనే అభిప్రాయాన్ని కూడా నేను తిరస్కరిస్తున్నాను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.