దేవుడు సృష్టిని ఆరు రోజుల్లోనే చేశాడా?
ఆదికాండములోని మొదటి అధ్యాయములో దేవుడు సృష్టినంతటిని చేసిన “ఆ ఆరు రోజులు” దీర్ఘ యుగాలను సూచిస్తూ ఉన్నాయా?
ఈ ప్రశ్నకు సైన్స్ అవును, ఈ సృష్టి ఉనికిలోనికి రావడానికి ఎన్నో దీర్ఘ యుగాలను తీసుకొనియుంది అని చెప్తూ ఉంది. కొన్ని మతాలు కొందరు బైబులు పండితులు సైన్స్ తో ఏకీభవిస్తూ, నిజమే అలా జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. కొంతమంది బైబిల్ పండితులు దేవుడు సృష్టిని ఆరు రోజులలోనే చేసియున్నాడని చెప్తారు. అట్లే ఒకొక్క రోజు కొన్ని యుగాలకు సమానమనే ఉదేశ్యములో, 2పేతురు3:8ని చూపిస్తూ, “ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరముల వంటిది” అని చెప్తుంటారు. ఇదే బైబులు పండితులు ఇదే వచనములోని రెండవభాగము చెప్తున్న దానిని పరిగణలోనికి తీసుకోరు, నిజానికి ఇదే వచనములోని రెండవభాగము “ప్రభువు దృష్టికి వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి” అని చెప్తున్నప్పటికిని ఈ మాటలు వారి వాదన తప్పు అని ఖండిస్తూ ఉన్నప్పటికిని వాళ్ళు పట్టించుకోరు.
“దినము” లేదా “రోజు” అనే పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నప్పటికి, ఒక సాధారణ రోజుకు ఉండే “24” గంటలను తెలియజేసేందుకు వాడే అతి సామాన్యమైన హీబ్రూపదమైన “యామ్” అనే మాట ఆదికాండము 1అధ్యాయములోని “ఆరు సృష్టిరోజులకు” వాడబడింది. యామ్ అనే మాట కాన్సెప్ట్ అఫ్ టైంకి సంబంధించిన మాట. ఉదాహరణకు భూమిపై ఒక రోజు అంటే 24 గంటలు. అంగారక గ్రహముపై అది ఎక్కువ. వేరే గ్రహాలపై అది ఇంకా ఎక్కువ కావొచ్చు. కాబట్టి ఈ మాటను కాంటెక్స్ట్ ని బట్టి అర్ధం చేసుకోవాలి. మన కాంటెక్స్ట్ లో అనగా భూగ్రహముపై దేవుడు నిర్ణయించిన 24 గంటలనే అర్ధములో మనం దీనిని అర్ధం చేసుకోవాల్సి ఉన్నాం. కాబట్టి మన కాంటెక్స్ట్ లో యామ్ అంటే 24 గంటలను కలిగిన ఒక సాధారణమైన రోజని అర్ధం.
చాలామంది “అస్తమయమును ఉదయమును” అనే మాటను బట్టి కన్ఫ్యూజ్ అవుతూ, నాల్గవ రోజు వరకు సూర్యుడు లేడు కదా. అస్తమయమును ఉదయమును ఎలా కలిగాయి? అసలు రోజులు ఎలా గడిచాయి? అని ప్రశ్నించొచ్చు. మనకు తెలిసిన పగలు + రాత్రి ఇవి రెండు కలిపితేనే కదా ఒక రోజు అని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కాబట్టే ఈ ప్రశ్న అసంబద్ధం, అప్రస్తుతం. ఎందుకంటే “రోజు” అనేది గడవడానికి టైం అవసరం. అట్లే “రోజు” అనే మాట కాల పరిమాణాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది దేవుడు రోజు పొడవును నిర్ణయించి ఉండటాన్ని తెలియజేస్తూ ఉంది.
టైం లక్షణాలు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? టైం అనేది నిజం. ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. టైం యొక్క అత్యంత విచిత్రమైన లక్షణాలలో ఒకటి చలనం. టైం కనికరంలేనిది. నిర్దాక్షిణ్యంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. అంటే దేవుడు టైంకి దిశను నిర్ధేశించినట్లేగా, దానికి నిర్దేశింపబడిన దిశలో టైం పోతూ ఉందంటే టైంకి ఒక క్రమము ఉన్నట్లేగా. టైంకి వ్యవధి ఉంది, సంఘటనల మధ్య టైంని మనం లెక్కించ వచ్చు. కాలానికి విశేషమైన వర్తమానం ఉంది, ఈ క్షణం మాత్రమే నిజం. అంతేనా టైం అనేది సార్వత్రికం, అంతటా ఉంటుంది. దీని ద్వారా అన్ని సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. టైం అనేది వర్తమానం నుండి భవిష్యత్తులోకి పురోగమిస్తూనే ఉంటుంది. వెనుకకు కాదు. టైం ఒత్తిడి లేనిది, దీనికి రంగు రుచి వాసన రూపం లేదు. అది చలనం ద్వారా స్పష్టంగా కనిపిస్తుందనేది వాస్తవం. మానవుల ప్రయోజనార్ధమై ప్రయోజనకారిగా పనిచేయడానికి 4వ రోజున సూర్యుడు సృష్టింపబడియున్నాడు తప్ప సూర్యుడు సృష్టింపబడినప్పటి నుంచి టైం ప్రారంభం కాలేదు.
కొందరు “అస్తమయమును ఉదయమును” అనే మాటను బట్టి కన్ఫ్యూజ్ అవుతూ, నాల్గవ రోజు వరకు సూర్యుడు మరియు నక్షత్రాలు సృష్టించబడకపోతే మొదటి రోజున కాంతి ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తూ ఉంటారు. నిజానికి హీబ్రూ భాష కాంతి పదార్ధము (కణాలు లేదా తరంగాల రూపంలో ఉన్న శక్తి లేదా రెండింటిని కలిగియున్న పదార్ధము) మరియు హీవెన్ లి లైట్ బేరర్ల (అంతరిక్షంలో కాంతిని ఉత్పత్తి చేసే వాటి) మధ్య ఉన్నతేడాను చాల స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. మొదటి రోజున దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగుకు నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, అది “తరంగ దైర్ఘ్యాలతో కూడిన ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ గా” నిర్వచించబడింది. వెలుగు అంటే వస్తువులను కనిపించేలా చేసే ఒక సహజమైన ఏజెంట్ మాత్రమే కాదండి. కాంతి కణాల వలె ప్రవర్తిస్తుంది తరంగాల వలె ప్రవర్తిస్తుంది కూడా. పదార్థంతో కాంతి పరస్పర చర్యలు విశ్వం యొక్క నిర్మాణాన్ని రూపొందించడంలో విశ్వం స్పేసులో విస్తరింపబడుటకు సహాయపడింది అనడంలో నిస్సందేహముగా ఎలాంటి సందేహము లేదు, అందుకు సైన్స్ కూడా ఏకీభవిస్తూ ఉంది.
శక్తివంతమైన దేవుని మాట వెలుగును ఉనికి లోనికి తెచ్చింది, వెంటనే వెలుగు కలిగింది. కాంతిని నియంత్రించేవి మూడు రోజుల తర్వాత గాని సృష్టించబడలేదు. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆయన చీకటిని నాశనం చేయలేదు, ఎందుకంటే కాంతి వలె, అది కూడా ఒక ప్రయోజనకరమైన ప్రయోజనానికి ఉపయోగపడుతుందని ఆయనకు తెలుసు. కాబట్టే పగలును చీకటిని ఒక క్రమమైన పద్దతిలో అందించుటకు దేవుడు కాంతిని నియంత్రించాడు. “రోజులో ” period of lightని కాంతి కాలమని దాని తరువాత చీకటి కాలాన్ని period of darknessని ఉంచాడు. అలాగే దేవుడు వెలుగునకు అంటే period of lightకి పగలనియు, చీకటికి అంటే period of darknessకి రాత్రి అనియు పేరు పెట్టాడని ఆదికాండము 1:5 తెలియజేస్తూ ఉంది.
ఈ విషయాన్నే “అస్తమయమును ఉదయమును కలుగగా” అనే మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మాటలకూ అర్ధం, “అస్తమయమును ఉదయమును” అనగా కాంతి కాలం ముగియుటను అస్తమయము అని చెప్తూ దాని తరువాత చీకటి కాలము దాని తరువాత తిరిగి కాంతి కాలము వచ్చుటను ఉదయము అని తెలియజేస్తూ ఉండటమే కాకుండా ఆయన వాటి మధ్య వ్యవధిని నిర్ణయించియున్నాడని వాటి ప్రయోజనాల్ని నిర్దేశించియున్నాడని కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి.
చివరిగా శాస్త్రవేత్తలు టైంని నిర్వచించడానికి ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం general theory of relativity సహాయముతో ఏవేవో చెప్తుంటారు. వాటిలో ప్రాముఖ్యముగా టైం ఉనికిలో లేదని చెప్పడం కంటే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంతిమ సిద్ధాంతం కాదనే విషయాన్ని మర్చిపోకండి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay no. is +91 9848365150